![]() |
![]() |
.webp)
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -87 లో.....మాధవకి మ్యాట్రిమోనీలో సంబంధం ఒకే చేస్తుంది మహా. ఆ విషయం నారాయణకి చెప్తుంది. వాళ్ళు నెంబర్ ఇచ్చారు.. ఈ రోజు సాయంత్రం బాగుందట ఫోన్ చేసి వస్తున్నామని చెప్పండి అని నారాయణతో మహా చెప్తుంది. ఎలా మాట్లాడాలో రెహర్సల్స్ చేస్తారు. అప్పుడే మాధవ వచ్చి ఏం జరుగుతుంది ఇక్కడ అని అడుగుతాడు. అందరు తనకి విషయం చెప్పడానికి భయపడుతారు కానీ మహా మాత్రం తన మాటలతో దబాయించి పెళ్లిచూపులకి రెడీ అయ్యేలా చేస్తుంది.
ఆ తర్వాత అందరు పెళ్లి చూపులకి రెడీ అయి వస్తారు. మహా చీర కట్టుకొని అందంగా వస్తుంది. తనని చూసి చక్రి ఫ్లాట్ అవుతాడు. వదిన ఈ రోజు చీరలో బాగున్నారని కన్నా చెప్తాడు. నేను చెప్దామనుకునే లోపే చెప్పేసాడు అని చక్రి కుళ్ళుకుంటాడు. ఆ తర్వాత కార్ లో వెళ్తుంటే చక్రి అద్దంలో మహా ని చూస్తాడు. అది గమనించిన కేశవ, కన్నా తనని ఆటపట్టిస్తారు. ఆ తర్వాత చక్రి ఒక దగ్గర కార్ ఆపి మహాకి పూలు కొంటాడు. పెట్టుకోమని ఇవ్వగా తను వద్దని అంటుంది. తీసుకో అమ్మ అని నారాయణ, మాధవ అంటే తీసుకొని తల్లో పెట్టుకుంటుంది. దాంతో చక్రి హ్యాపీగా ఫీల్ అవుతాడు. అమ్మాయి వాళ్ళ ఇంటికి వెళ్తారు. అమ్మాయి తండ్రి ట్రెండ్ అంటూ తన మాటలతో చిరాకు తెప్పిస్తాడు. అమ్మాయి జ్యోతి, మాధవ పక్కకి వెళ్లి మాట్లాడుకుంటారు. కొన్ని రోజులు ట్రావెల్ చేసి ఆ తర్వాత ముహూర్తం పెట్టుకుందామని అమ్మాయి వాళ్ళ నాన్న అంటారు. ఒకరి నెంబర్ ఒకరు ఎక్స్చేంజ్ చేసుకుంటారు. ఆ తర్వాత అందరు ఇంటికి వస్తారు.
మహాకి హారిక ఫోన్ చేసి మాట్లాడుతుంది. ఈ రోజు మా పెద్దికి సంబంధం చూడడానికి వెళ్ళామని మహా చెప్తుంది. నువ్వు వెళ్లడం ఏంటి.. నీ ఫ్యామిలీ ఇక్కడ ఉంది అని హారిక అంటుంది. నాకు అండగా ఉన్నవాళ్లే నా వాళ్ళు మా పెద్ది పెళ్లి అయ్యేవరకు నేను ఎక్కడికి రానని మహా చెప్తుంది. ఆ తర్వాత భోజనం చేస్తూ అందరు సరదాగా మాట్లాడుకుంటారు. అప్పుడే అమ్మాయి జ్యోతి ఫోన్ చేస్తుంది. అన్నయ్య బయటకు వెళ్లి మాట్లాడమని మాధవని బయటకు పంపిస్తారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |